Thursday 14 March 2013



కాలే కడుపుకి రుచి తెలీదు
మండే కట్టెకి వర్ణం లేదు
అర్ధించే చేతులకి తనపర భేదం లేదు
పీల్చే గాలికి కులం
తాగే నీరుకి మతం లే
దు !
...See More
కాలే కడుపుకి రుచి తెలీదు 
మండే కట్టెకి వర్ణం లేదు 
అర్ధించే చేతులకి తనపర భేదం లేదు 
పీల్చే గాలికి కులం
తాగే నీరుకి మతం లేదు !

నడిమధ్యన వచ్చావ్ 
చివరకి ఆమట్టిలోనే కలుస్తావ్ 
తోలుతిత్తి శరీరానికి
బంధాల మందు జల్లి  
అహం అనే మత్తులో 
కష్టాల కొలిమిలో భవసాగరాన్ని ఈదుతున్నవ్ !

ఊపిరి ఆగే వరకే ఈ బంధం 
కట్టెకాలే వరకే ఈ పాశం
జానెడు పొట్టకోసం 
ఆరడుగుల నేలకోసం ఇన్ని పాట్లా 
మానవ జన్మకి ఇన్ని వెతలా !.......@ బాటసారి

No comments:

Post a Comment