Saturday, 26 May 2012


MEETING WITH GDS LEADERSHIP OF AP CIRCLE - AIPEU-GDS(NFPE)

తేది .24-05-2012 న హైదరాబాద్, యూనియన్ ఆఫీసు నందు ఆంధ్ర ప్రదేశ్  సర్కిల్  AIPEU-GDS(NFPE) జి.డి .ఎస్ బ్రాంచ్, డివిజన్, సర్కిల్  కార్యవర్గ సభ్యులు, కార్యదర్శుల సమావేశము  కా.వి.విజయ కృష్ణ అధ్యక్షతన  జరిగినది. 
ఈ సమావేశము ను ఉద్దేశించి కా.ఆర్ .సుధా భాస్కర్ (సి.ఐ.టి.యు ), కా. కే. రాఘవెంద్రన్ (ఎన్ .ఎఫ్.పి .ఇ  పూర్వ  ఉన్నత  కార్యదర్శి), కా. ఈశ్వర్ సింగ్ దబాస్(పి -4 ప్రధాన కార్యదర్శి),  కా. గిరి రాజ్ సింగ్ (ఆర్-3 ప్రధాన కార్యదర్శి ),  కా.హుమాయున్ (పి -4 కేంద్ర అధ్యక్షులు), కా.డి.ఎ.ఎస్ .వి .ప్రసాద్ (పి -3 సర్కిల్ కార్యదర్శి), కా. ఆర్.జే.మధు సూదన రావు (ఆర్-3 సర్కిల్ కార్యదర్శి), కా.వై.నాగభూషణం (సర్కిల్ కార్యదర్శి , కాజువాల్  ఉద్యోగుల  యూనియన్), కా. కే.సుధాకర్ (పి -3 సర్కిల్ సహాయ కార్యదర్శి ) కా. ఎస్.ఎస్.ఆర్.ఎ . ప్రసాద్ (పి -3  సర్కిల్  సహాయ కార్యదర్శి) మొ ..వారు  ప్రసంగించారు. 

పూర్తి స్థాయి చర్చల అనంతరం క్రింది నిర్ణయాలు తీసుకోనబడినవి. 

1) ప్రతి బ్రాంచ్ , డివిజన్ లో సాధ్య మైనంత త్వరలో AIPEU-GDS(NFPE) పేరున సంఘం ఏర్పాటు చేయాలి.
2)సంఘ కార్య కలాపాలు కొనసాగుటకు సభ్యుల వద్ద నుండి సంఘ నిబంధనావళి ప్రకారము చందా తీసుకోవాలి. 
3) GDS CRUSEDAR - కేంద్ర సంఘ  మాస పత్రిక కు  ఎక్కువ మంది  చందా   దారులను చేర్పించాలి. 
4)కేంద్ర సంఘము నకు  ఆర్ధిక సహాయము అందజేయాలి. 
5) బ్రాంచ్ , డివిజన్ సంఘాల  ఏర్పాటు , సంఘ నిర్మాణము గురించి చర్చించుటకు 10-06-2012 తేదిన పి -3, పి -4  సంఘాలతో కలసి రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయబడును. (స్థలము త్వరలో తెలియజేయబడును )
6)ఆగస్ట్ / సెప్టంబర్ మాసములో సర్కిల్ కాన్ఫరెన్స్ జరుప బడును.
7) నవంబర్ / డిశంబర్ మాసములో అల్ ఇండియా మహా సభలు జరుపబడును. 

జి .డి.ఎస్. సమస్యలపై పోరాట కార్యక్రమము :

-- తేది 28-06-2012 న సర్కిల్  / ఆర్.ఓ / డివిజన్ స్థాయిలలో ధర్నా / ప్రదర్శనలు
-- తేది.26-07-2012 "మార్చ్ టు పార్లమెంట్ " కార్యక్రమము - ఎన్ .ఎఫ్.పి .యి సదస్సు 
-- తేది 27-07-2012 పార్లమెంట్ వద్ద జి.డి.ఎస్ ఉద్యోగుల మాస్ ధర్నా - ప్రభుత్వానికి  మెమొరాండం సమర్పణ.
పై కార్యక్రమములు అన్ని ఎన్ .ఎఫ్.పి .యి సంఘాలతో కలసి నిర్వహించ బడును..

No comments:

Post a Comment