Sunday, 29 April 2012


EXTENDED CENTRAL WORKING COMMITTEE MEETING OF AIPEU-GDS(NFPE)

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ కు అనుబంధముగా నూతనంగా ఏర్పడిన జి.డి.ఎస్ యూనియన్ --
"అఖిల భారత  తపాల ఉద్యోగుల సంఘం - జి.డి.ఎస్ (ఎన్.ఎఫ్.పి.యి)" యొక్క మొదటి కార్య వర్గ సమావేశములు 23-05-2012 తేదిన హైదరాబాద్ నందు నిర్వహించుటకు నిర్ణయించ బడినది. 
నూతన యూనియన్ కు సంబందించిన నిబంధనావళి, బ్రాంచ్ / డివిజన్ సంఘాల ఏర్పాటు, సంఘ నిర్మాణము, జి.డి.ఎస్. సమస్యలపైన విస్త్రుత స్థాయిలో చర్చించబడును. 
కా.విజయ గోపాల్ సుర్ (జి.డి.ఎస్ కేంద్ర సంఘ అధ్యక్షులు)  అధ్యక్షతన జరుపబడుచున్న ఈ సమావేశములకు ప్రధాన కార్య దర్శులు, ముఖ్య నాయకులను ఆహ్వానించడం జరిగినది.

SUBMISSION OF LETTER OF AUTHORIZATION (WITHDRAWL OF MEMBERSHIP FROM AIPEDEU) TOMORROW 30-04-2012

ఎ.ఐ.పి.యి.యు -జి.డి.ఎస్ (ఎన్.ఎఫ్.పి.యి) యూనియన్ పట్ల సానుకూలంగా ప్రతిస్పందిస్తూ యితర యూనియన్ల నుండి సభ్యత్వ విరమణ పొందుతూ దాదాపు ప్రతి డివిజన్ లోను జి.డి.ఎస్ ఉద్యోగులు లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ యివ్వడం జరిగినది. ఈ స్పందనను పెద్ద ఎత్తున తెలియజేయడానికి 30-04-12 తేదిన సంబంధిత డివిజనల్ / బ్రాంచ్ కార్యదర్శులు, కార్య కర్తలు లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ ఫారములను డివిజనల్ అధికారులకు అందజేయ వలసినదిగా కోరుచున్నాము.(సభ్యత్వ విరమణ ఫారములు మాత్రము). సభ్యత్వ నమోదు ఫారములు తదుపరి రూపొందించబడే కార్యక్రమములో డివిజన్ అధికారులకు అందజేయబడును. దీనికి సంబంధించిన వివరములు త్వరలో తెలియజేయబడును.
కొన్ని డివిజన్లలో సభ్యత్వ విరమణ పట్ల పలు సందేహాలు, అనుమానాలు ఉన్నప్పటికీ కొంత మేర సేకరించినట్లు తెలియుచున్నది. ఏమైనప్పటికీ 30 వతేది నాటికి ఏర్పడియున్న పరిస్థితులను అంచనా వేసుకొని తదుపరి కార్యక్రమము రూపొందించ బడును.
మన రాష్ట్రములోనే కాకుండా, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో 80 - 90 శాతము సభ్యత్వ విరమణ ఫారములు సేకరించబడి 30 వ తేది అందజేయు చున్నట్లు తెలియజేయబడినది. మిగిలిన రాష్ట్రాలలో కూడా 30 - 40 శాతము కార్యక్రమము పూర్తీ చేయబడి వున్నట్లు సమాచారము. 
ఇప్పటివరకు నూతన జి.డి.ఎస్ సంఘానికి తోడ్పాటు నందించిన ప్రతి జి.డి.ఎస్ మరియు డిపార్టుమెంటు ఉద్యోగులకు, కార్యవర్గ సభ్యులకు అందరికి ధన్యవాదములు.

No comments:

Post a Comment